News November 11, 2024

అనంతపురం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం వినిపిస్తారా?

image

నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశం కావడంతో ప్రజల్లోనూ, నాయకుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ముందు గ్రామ సమస్యలు, యువతకు ఉద్యోగాలు వంటి అంశాలపై ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు గుమ్మరించారు. మరి వాటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో గళం వినిపిస్తారా, లేదా? మీరేమంటారు?

Similar News

News December 8, 2024

వరకట్న వేధింపుల కేసులో ముద్దాయిలకు జైలు శిక్ష

image

వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో ముద్దాయిలకు జైలు శిక్ష విధించినట్టు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ముదిగుబ్బ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన చెన్నకేశవరెడ్డి కుమార్తె స్రవంతిని కొత్తచెరువుకు చెందిన ఓం ప్రకాశ్ రెడ్డికి ఇచ్చి 2015లో వివాహం చేశారు. అయితే అదనపు కట్నం కోసం భర్త కుటుంబ సభ్యులు ఆమెపై హత్యాయత్నం చేశారు. ఈ కేసులో ముద్దాయిలకు మూడేళ్ల జైలు శిక్ష విధించారని ఎస్పీ తెలిపారు.

News December 8, 2024

సమష్టి కృషితో డ్రగ్స్ భూతాన్ని పారదోలుదాం: ఎస్పీ

image

సమష్టి కృషితో డ్రగ్స్ అనే భూతాన్ని సమాజం నుంచి పారదోలుదామని జిల్లా ఎస్పీ రత్న ఐపిఎస్ పేర్కొన్నారు. శనివారం ధర్మవరం బీఎస్ఆర్ బాలికల పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్‌కు ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజాన్ని విద్యార్థులను యువతను డ్రగ్స్ అనే భూతం పట్టి పీడిస్తోందని అందరి కృషితో సమాజం నుంచి పారదోలుదాం అన్నారు.

News December 7, 2024

‘13న రైతు సమస్యలపై భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం’

image

ఉమ్మడి అనంత జిల్లాలో రైతుల సమస్యలపై ఈనెల 13న ఉదయం 10 గంటలకు అనంతపురంలోని జడ్పీ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహం నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్నట్లు కళ్యాణదుర్గం YCP ఇన్‌ఛార్జ్ తలారి రంగయ్య తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులను పాల్గొనాలని పిలుపునిచ్చారు.