News August 26, 2024
అనంతపురం: ఐటీఐలో రేపు జాబ్ మేళా

అనంతపురం స్థానిక ఐటీఐ కళాశాలలో ఈనెల 27న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రామమూర్తి ఆదివారం తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం సమీపంలోని అమర్ రాజా ఎనర్జీ మొబిలిటీ లిమిటెడ్ కంపెనీలో టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ పూర్తి చేసిన వారితో పాటు చివరి సంవత్సరం పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు భోజన వసతితో పాటు నెలకు రూ.14 వేలు వేతనం చెల్లిస్తారు.
Similar News
News April 11, 2026
‘బెస్ట్ మహిళా ఇంజినీరింగ్ ప్రొఫెసర్’గా కళ్యాణి రాధా

అనంతపురం జేఎన్టీయూ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ కళ్యాణి రాధా ‘బెస్ట్ మహిళా ఇంజినీరింగ్ ప్రొఫెసర్’ అవార్డు అందుకున్నారు. శుక్రవారం టెక్కలిలో జరిగిన ఏపీ ISTE రాష్ట్ర సదస్సులో ఈమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె మెకానికల్ విభాగాధిపతిగా, కళాశాల NSS ప్రోగ్రాం ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు.
News April 10, 2026
రాయలసీమ అభివృద్ధికి జగన్ ఆటంకం: ఎంపీ

రాయలసీమకు అసలైన ద్రోహి జగన్ రెడ్డేనని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విమర్శించారు. గత ప్రభుత్వంలో 102 ప్రాజెక్టులను రద్దు చేసి, నేడు రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సీమ ప్రాజెక్టుల కోసం రూ.10,014 కోట్లు కేటాయించి, చరిత్ర సృష్టించిందన్నారు. 80శాతం ప్రాజెక్టులు ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే నిర్మించినవని గుర్తుచేశారు.
News April 10, 2026
వైశాలి ఘోర్పడేకు ‘బెస్ట్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్’ అవార్డు

అనంతపురం జేఎన్టీయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ వైశాలి ఘోర్పడే ‘బెస్ట్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్’ అవార్డును అందుకున్నారు. శుక్రవారం సాయంత్రం టెక్కలిలో జరిగే ఏపీ ISTE రాష్ట్ర సదస్సులో ఈమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గతంలో ఈమెకు కాంక్రీట్ మీద చేసిన పరిశోధనలకు గాను పలు పేటెంట్లు కూడా దక్కాయి. ఇప్పటి వరకు 100కు పైగా అంతర్జాతీయ పత్రికలను, 4 పుస్తకాలను ప్రచురణ చేశారు.


