News September 3, 2024
‘అనంతపురం కలెక్టరేట్ వద్ద ధర్నాను విజయవంతం చెయ్యండి’

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ఠపర్చాలని ఈనెల 6న అనంతపురం కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పిలుపునిచ్చారు. అనంతపురంలోని పాతఊరులో మంగళవారం కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో విఫలమైందన్నారు. ప్రజలు భారీగా వచ్చి ధర్నాను విజయవంతం చెయ్యాలని కోరారు.
Similar News
News October 27, 2025
అనంతపురంలో దారుణం.. బాలుడిని చంపిన వ్యక్తి

అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక అరుణోదయ కాలనీలో సుశాంత్(5) అనే బాలుడిని పక్కింటి వ్యక్తి హతమార్చినట్లు సమాచారం. అయితే ఆదివారం తమ బాలుడు కనిపించడం లేదని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 27, 2025
రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్లో సత్తాచాటిన క్రీడాకారులు

కర్నూలులో ఏపీ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ఆదివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో జిల్లా క్రీడాకారులు రాణించారు. ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఉదయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ.. సంతోష్‌కు అండర్-6లో 4వ స్థానం, వెనీషాకు బాలికల -12లో 4వ స్థానం, నితీష్‌కు -14లో 5వ స్థానం, జనని ఎఫ్-10లో 8వ స్థానం సాధించారన్నారు. విజేతలకు టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ కామిశెట్టి బహుమతులు అందించారు.
News October 26, 2025
యాడికి: బైక్‌ను ఢీకొన్న బొలెరో.. వ్యక్తి మృతి

యాడికి మండలం రాయలచెరువులోని పెట్రోల్ బంకు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాయలచెరువుకు చెందిన పుల్లయ్య మోడల్ స్కూల్లో వాచ్‌మెన్‌గా పనిచేసే పుల్లయ్య మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఇంటి నుంచి బైక్‌పై మోడల్ స్కూల్‌కు బయలుదేరాడు. వెనుక నుంచి బొలెరో ఢీ కొంది. ప్రమాదంలో పుల్లయ్య మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


