News April 5, 2024
అనంతపురం కలెక్టర్గా వినోద్ కుమార్ పదవీ బాధ్యతలు

అనంతపురం జిల్లా కలెక్టర్గా నియమితులైన వినోద్ కుమార్ ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన గౌతమిని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేశారు. కార్యాలయానికి వచ్చిన ఆయనకు రెవిన్యూ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండి ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తానని హమీ ఇచ్చారు.
Similar News
News December 20, 2025
రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

పామిడి పట్టణ శివారులో శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న వాహనాన్ని వెనుక వైపు నుంచి కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన విషయం విధితమే. ఘటనా స్థలాన్ని పామిడి ఇన్ఛార్జ్ సీఐ ప్రవీణ్ కుమార్తో కలిసి ఎస్పీ జగదీశ్ పరిశీలించారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
News December 20, 2025
అనంత: ఒకే పాఠశాల నుంచి 52 మంది విద్యార్థులు

అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 52 మంది విద్యార్థులు ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పీఈటీ సంజీవరాయుడు శిక్షణలో విద్యార్థులు ప్రతిభ చాటారని హెచ్ఎం రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయిలోనూ రాణించి పాఠశాలకు కీర్తి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించింది.
News December 19, 2025
ఏబీసీ అవార్డులందుకున్న జిల్లా పోలీసులు

కేసుల చేధింపులో రాష్ట్రంలోనే అత్యుత్తమ ప్రతిభ చూపిన రాయదుర్గం అర్బన్, రూరల్ సీఐ జయనాయక్, వెంకటరమణ, వారి సిబ్బంది ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. డీజీపీ చేతుల మీదుగా ప్రతీ ఏడాది టాప్ త్రీ కేసులు చేధించిన వారికి ఏబీసీ అవార్డులు ఇచ్చి సత్కరించడం ఆనవాయితీ. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఎస్పీ జగదీశ్, డీఎస్పీ రవిబాబుతో కలసి డీజీపీ హరీశ్ కుమార్ గుప్త చేతుల మీదుగా వారు అవార్డును అందుకున్నారు.


