News November 16, 2024
అనంతపురం కలెక్టర్ సూచనలు
ఆడపిల్లల రక్షణ, భద్రతకు అధికారులు కృషి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం “మిషన్ శక్తి” ఇంటిగ్రేటెడ్ మహిళాసాధికారత కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. హింసకు గురవుతున్న మహిళలు, సహాయం కావలసిన వారికి పునరావాసం, భద్రత కల్పించడానికి పథకాన్ని ప్రవేశ పెట్టారని చెప్పారు.
Similar News
News December 11, 2024
అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు దాడులు: ఎస్పీ
అనంతపురం జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో పోలీసులు చేపట్టిన కార్యక్రమాలు, దాడులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వివరాలను ఎస్పీ జగదీశ్ బుధవారం వెల్లండించారు. జిల్లాలో గడచిన 24 గంటలలో రోడ్డు భద్రతా ఉల్లంఘనలపై 789 కేసులు నమోదు చేసి రూ.1,86,350 ఫైన్స్ విధించామన్నారు. బహిరంగంగా మద్యం తాగిన వారిపై ఓపెన్ డ్రింకింగ్ 61 కేసులు, డ్రంకన్ డ్రైవింగ్‌పై 20 కేసులు నమోదు చేశామన్నారు.
News December 11, 2024
గార్లదిన్నె మండలంలో బాలికపై అత్యాచారం
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో దారుణ ఘటన జరిగింది. బాలికపై వంశీ అనే వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పదో తరగతి వరకు చదివిన బాలిక పొలం పనులకు వెళ్తోంది. కూలీలను పొలానికి తీసుకెళ్లే డ్రైవర్‌కు బాలికతో పరిచయం ఏర్పడంది. మాయమాటలతో అత్యాచారం చేశాడు. కడుపు నొప్పిగా ఉందని బాలిక పామిడి ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా ఏడు నెలల గర్భిణి అని తేలిసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News December 11, 2024
విజయవాడకు వెళ్లిన అనంత, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు డా.వినోద్ కుమార్, టీఎస్ చేతన్ విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.