News January 10, 2026

అనంతపురం: గుండెపోటుతో SI మృతి

image

అనంతపురం జిల్లా పోలీస్ కంట్రోల్ రూం SI మోహన్ ప్రసాద్ విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో కన్నుమూశారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఎస్సై మృతి పట్ల జిల్లా ఎస్పీ జగదీశ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి సానుభూతి తెలిపారు. జేఎన్టీయూ రోడ్డులో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు, సహచర సిబ్బంది నివాళులర్పించారు.

Similar News

News January 16, 2026

విశాఖలో భూ లిటిగేషన్‌లతో తలపోటు (1/2)

image

విశాఖలో భూ లిటిగేషన్లు మరోసారి తలపోటుగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భూములపై అక్రమార్కులు తిష్ట వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో వివాదాలు తెరపైకి రావడం యంత్రాంగానికి సవాల్‌గా మారింది. శివారు ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరగడంతో యాజమాన్య హక్కులపై సవాళ్లు పెరుగుతున్నాయి.

News January 16, 2026

విశాఖలో భూ లిటిగేషన్‌లతో తలపోటు (2/2)

image

విశాఖలో భూ లిటిగేషన్లు ఎంతలా ఉన్నాయంటే.. ఇటీవల పెందుర్తి (M) చింతగట్లలో ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపునకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై రాళ్లదాడికి తెగబడ్డారు. అదేవిధంగా గండిగుండంలో భూ వివాదం చెలరేగింది. VMRDA చేపడుతున్న అడవివరం–సొంట్యం రహదారి విస్తరణతో ల్యాండ్ విలువ రూ.కోట్లు పలుకుతోంది. ఈ నేపథ్యంలో అక్రమాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నా.. లిటిగేషన్ బ్యాచ్‌ల ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

News January 16, 2026

NGKL: 1,148 టన్నుల యూరియా నిల్వలు- కలెక్టర్

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో శుక్రవారం నాటికి 1,148 టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ఈ నెలలో 5,689 టన్నుల యూరియా జిల్లాకు రానుందని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 19,280 టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. ఇప్పటివరకు 65 శాతం మంది రైతులు వారి పంటలకు అవసరమైన యూరియాను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.