News November 24, 2024

అనంతపురం: ఘోర రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి

image

గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను బస్సు ఢీకొన్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సాయంత్రం వరకు ఏడుగురు మరణించగా.. ప్రస్తుతం అనంతపురంలోని సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరయ్య మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ఈశ్వరయ్యకు మెరుగైన వైద్యసేవలు అందించినా.. దురదృష్టవశాత్తు అతను కూడా మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Similar News

News December 5, 2024

విపత్తుపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ చేతన్

image

సహజంగా జరుగుతున్న విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం హోం మంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విపత్తు నిర్వహణపై పలు సూచనలు చేశారని కలెక్టర్ తెలిపారు. వాతావరణ శాఖ సూచనలపై ప్రత్యేక దృష్టిని సారించాలని, విపత్తు నిర్వహణలో భాగంగా సమావేశ సహకారాలతో ప్రజలను కాపాడాలన్నారు.

News December 4, 2024

26 జిల్లాల్లో డీఎస్పీ ఉచిత కోచింగ్ కేంద్రాలు ప్రారంభమం: మంత్రి సవిత

image

రాష్ట్రంలోని వివిధ బిసి వర్గాల అభ్యర్ధులకు 26 జిల్లాల్లో ఉచిత డీఎస్సీ కోచింగ్ కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించామని మంత్రి సవిత పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవిత మాట్లాడారు. త్వరలో సవిల్ సర్వీస్ ఉచిత కోచింగ్ కేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఆర్ధికంగా వెనుకబడిన(EWS) వర్గాల వారి అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

News December 4, 2024

శ్రీ సత్యసాయి: విషాదం.. ఇంటి పైకప్పు కూలి ఇద్దరి మృతి

image

చిలమత్తూరు మండలం శెట్టిపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇంటి పైకప్పు కూలి ఇద్దరు మృతిచెందారు. బుధవారం సాయంత్రం స్లాబ్ నిమిత్తం అమర్చిన కట్టెలను తొలగిస్తుండగా ఇల్లు కుప్పకూలింది. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, శివారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరొకరు చికిత్స పొందుతున్నారు. కాగా, అనంతపురం జిల్లా కందుర్పిలో మిద్దె కూలి <<14784951>>ముగ్గురు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే.