News October 30, 2024

అనంతపురం జిల్లాకు వర్ష సూచన

image

రానున్న మూడు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త గుత్తా నారాయణస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జల్లులు పడతాయని చెప్పారు. ఈ సమయంలో పగటి ఉష్ణోగ్రతలు 33-34.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కావచ్చని తెలిపారు. ఇక గాలులు గంటకు 2 కి.మీ వేగంతో వీచే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.

Similar News

News November 8, 2024

కేతిరెడ్డి మరదలు వసుమతికి నోటీసులు!

image

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నీటి పారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిక్కవడియార్ చెరువులో ఆక్రమణలు జరిగాయని, ఏడు రోజుల్లోగా కబ్జా చేసిన స్థలాన్ని ఖాళీ చేయాలని అందులో పేర్కొన్నారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుమారు 20 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారని సమాచారం.

News November 8, 2024

9న అనంతపురంలో ‘గేమ్ ఛేంజర్’ టీజర్ రిలీజ్

image

‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్‌ను ఈ నెల 9న సాయంత్రం 4:30 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అనంతపురంలోని త్రివేణి థియేటర్‌లో టీజర్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ నటించిన ఈ మూవీ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్టర్ శంక‌ర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

News November 8, 2024

కేజీబీవీ పాఠశాలలో 55 మందికి నియామక ఉత్తర్వులు

image

శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని కేజీబీవీ పాఠశాలలో 19 కేటగిరీల కింద 55 మందికి నియామక ఉత్తర్వులు ఇచ్చినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య పేర్కొన్నారు. వివిధ కేటగిరీల కింద 70 మందిని ఎంపిక చేయడంలో భాగంగా 1:5 రేషియోలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ఆయా కేటగిరీల కింద రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం 70 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి 55 మందికి నియామక ఉత్తర్వులు అందజేశామన్నారు.