News October 18, 2024

అనంతపురం జిల్లాలోని మహిళా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

image

అనంతపురం జిల్లాలో మహిళా నిరుద్యోగులకు రూడ్ సెట్ శుభవార్త చెప్పింది. మహిళలకు జర్దోసి, మగ్గం, బ్యూటీషియన్ కోర్సుల్లో నవంబర్ 15 నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ లక్ష్మీదేవి పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. శిక్షణ కాలం 30 రోజులు ఉంటుందని, ఉచిత భోజనం, వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు అనంతపురంలోని కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

Similar News

News November 6, 2024

మద్దెలచెరువు సూరి హత్య కేసు నిందితుడికి బెయిల్

image

అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు బెయిల్ మంజూరైంది. సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసులో హైదరాబాద్ సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సూరి హత్య కేసులో గతంలో జీవిత ఖైదు శిక్ష పడటంతో అతడు జైలులోనే ఉండనున్నాడు. 2011 జనవరి 4న భాను కిరణ్ చేతిలో సూరి హత్యకు గురైన విషయం తెలిసిందే. భాను కిరణ్ 12 ఏళ్లుగా చంచల్‌గూడ జైలులో ఉంటున్నాడు.

News November 6, 2024

ATP: పరారైన బాలుడిని తండ్రికి అప్పగించిన పోలీసులు

image

అనంతపురం జిల్లా గుత్తికి చెందిన 15 ఏళ్ల బాలుడు ఇంటి నుంచి పారిపోయి విశాఖ నగరానికి చేరుకున్నాడు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కూర్చుని ఉన్న బాలుడిని స్థానికులు గుర్తించి టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలుడి వివరాలు అడిగి తెలుసుకుని పాపా హోంలో ఆశ్రయం కల్పించారు. మంగళవారం ఉదయం నగరానికి చేరుకున్న తండ్రికి బాలుడిని అప్పగించారు.

News November 6, 2024

ATP: ముగ్గురు వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసు

image

కనగానపల్లి మండలంలో ముగ్గురు వైసీపీ నేతలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బద్దలాపురంలో దామోదర్ రెడ్డి, దినేశ్ రెడ్డి, శంకర్ రెడ్డి.. లక్ష్మీనరసమ్మ, నరసింహులు అనే దళిత దంపతుల మధ్య పొలం విషయమై గొడవ జరిగింది. తమను కులం పేరుతో తిట్టారని వారు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై ఇషాక్ బాషా తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.