News July 20, 2024

అనంతపురం జిల్లాలో అగ్నిగుండంలో పడిన వ్యక్తి మృతి

image

ఉరవకొండ మండల చిన్నకౌకుంట్లలో ఈ నెల 17న జరిగిన మొహర్రం వేడుకల్లో అపశ్రుతి జరిగిన విషయం తెలిసిందే. చాకలి ఆదినారాయణ (38) అనే వ్యక్తి అగ్నిగుండంలో కింద పడ్డారు. అనంతపురంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారని పోలీసులు తెలిపారు. పీర్ల అగ్నిగుండ ప్రవేశం సమయంలో ప్రమాదవశాత్తు పడగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు.

Similar News

News October 26, 2025

జిల్లాస్థాయి చెస్ పోటీలకు తాడిపత్రి విద్యార్థి ఎంపిక

image

జిల్లా స్థాయి చెస్ పోటీలకు తాడిపత్రి విద్యార్థి లిఖిలేశ్వర్ రావు ఎంపికైనట్లు కోచ్ పవన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణంలోని జూనియర్ కళాశాలలో జరిగిన మండల స్థాయి చెస్ పోటీలలో అండర్ -17 విభాగంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి లిఖిలేశ్వర్ రావు ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఎంపికైన విద్యార్థిని అధ్యాపక బృందం, కోచ్ పవన్ కుమార్ రెడ్డి అభినందించారు.

News October 25, 2025

రాయదుర్గం: ఇన్‌స్టాగ్రాం పిచ్చి.. మృత్యువుకు దారి తీసింది

image

BTP డ్యాం స్పిల్ వే గేటు వద్ద గల్లంతైన యువకుడి వివరాలు లభ్యమయ్యాయి. రాయదుర్గంలోని కలేగార్ వీధికి చెందిన ముగ్గురు యువకులు డ్యాం గేట్లు ఓపెన్ చేస్తుండటంతో ఇన్‌స్టాగ్రాం వీడియోల కోసం వెళ్లారు. అందులో ఇద్దరు నీటిలో ఈత కొడుతూ.. గల్లంతయ్యారు. వారిలో ఒకరు బయటకురాగా మరో యువకుడు మహమ్మద్ ఫైజ్ ఆచూకీ లభించలేదు. చివరకు మత్స్యకారులు మృతదేహాన్ని వెలికితీశారు. యువకుడి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని విలపించారు.

News October 25, 2025

డ్రగ్స్, గంజాయిని అరికట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో డ్రగ్స్, గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టాలని అధికారులను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో డ్రగ్స్, గంజాయి నియంత్రణ చర్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రాణాంతకమైన డ్రగ్స్, గంజాయిని అందరూ కలిసికట్టుగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు.