News July 22, 2024
అనంతపురం జిల్లాలో తేలికపాటి వర్షాలు

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకలకుంట వాతావరణ శాస్త్రవేత్త గుత్తా నారాయణస్వామి తెలిపారు. గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News October 24, 2025
జేసీ వ్యాఖ్యలను ఖండించిన అనంతపురం రేంజ్ డీఐజీ

తాడిపత్రి ASP రోహిత్ కుమార్ చౌదరిపై మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను అనంతపురం రేంజ్ DIG షేమోషీ తీవ్రంగా ఖండించారు. గురువారం తన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ వారికి దేశ సేవ చేయడమే ప్రధాన ధ్యేయం అన్నారు. తమకు కులం, మతం, ప్రాంతం తేడా ఉండదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిని అవమానకర భాషలో సంభోదించడం పరిపాలనా ప్రమాణాలకు విరుద్ధం అన్నారు.
News October 24, 2025
కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్

భారీ వర్షాల నేపధ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండరాదన్నారు. ఇబ్బందులు ఎదురైతే సహాయం కోసం 8500292992కు కాల్ చేయాలన్నారు.
News October 24, 2025
పోలీసుల సేవలపై వ్యాసరచన పోటీలు: ఎస్పీ

పోలీసుల అమర వీరుల వారోత్సవాలు జరుగుతున్నట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. అనంతపురం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసుల విధులు, సేవలు, త్యాగాల గురించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. సమాజంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. పోలీసుల సేవలపై వ్యాసరచన పోటీలు నిర్వహించామని ఎస్పీ తెలిపారు.


