News August 5, 2024

అనంతపురం జిల్లాలో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష

image

ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన రామాంజనేయులు అనే వ్యక్తికి అనంతపురం పోక్సో కోర్టు జడ్జి రాజ్యలక్ష్మి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. మే 8, 2020లో పెద్దవడుగూరులో ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన రామాంజనేయులు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కేసు నమోదు కాగా పలు దఫాల విచారణ అనంతరం శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Similar News

News September 16, 2024

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: అనంత ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఎస్పీ జగదీశ్ ఆదివారం తెలిపారు. మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. సెప్టెంబర్ 23న తిరిగి ఈ కార్యక్రమానికి నిర్వహిస్తామన్నారు.

News September 15, 2024

అనంతపురం జిల్లాకు 8 మంది DSPల రాక

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎనిమిది మంది DSPలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం రూరల్‌కు DSPగా వెంకటేశ్వర్లు, అనంతపురం-శ్రీనివాసరావు, గుంతకల్-అముదల శ్రీనివాస్, తాడిపత్రి-రామకృష్ణుడు, అనంతపురం ఉమెన్ పీఎస్-మహబూబ్ బాషా, అనంతపురం-శరత్ రాజ్ కుమార్, అనంతపురం-సునీల్, కదిరికి శివనారాయణ స్వామి బదిలీపై రానున్నారు.

News September 15, 2024

అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమం: అనంత కలెక్టర్

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ రెండో తేదీన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ దివస్‌ను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ‘స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని’ నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.