News October 22, 2024
అనంతపురం జిల్లాలో పిడుగులు పడే అవకాశం

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి పుట్టపర్తి, అనంతపురం తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని APSDMA హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెట్లు, టవర్లు, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదని ప్రజలను అప్రమత్తం చేస్తోంది. జిల్లా ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపుతోంది.
Similar News
News October 26, 2025
అనంతపురంలో రేపు పీజీఆర్ఎస్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 27న రేపు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన దరఖాస్తు స్లిప్పులను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News October 26, 2025
మోంతా ఎఫెక్ట్: అనంతపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మోంతా తుఫాను దూసుకొస్తోంది. దీంతో అనంతపురం జిల్లా అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసర వేళ 85002 92992 నంబరుకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. తుఫాను పర్యవేక్షణ కోసం జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి వడరేవు వినయ్ చంద్ను ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది.
News October 26, 2025
Pic Of The Day

తాడిపత్రి పరిసరాలు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు ఆకర్షణీయ స్థలంగా మారుతున్నాయి. ఆలూరు కోన దేవస్థానం, జలపాతం, ఓబులేసు కోన ఘాట్ రోడ్లు తిరుమల దారులను తలపిస్తున్నాయి. అక్కడి నుంచి కనిపించే పచ్చని కొండలు, పంట పొలాలు తాడిపత్రి అందాలను మరింత అద్భుతంగా చూపిస్తున్నాయి. సెలవుల్లో ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ప్రకృతి అందాలు, పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు.


