News October 22, 2024

అనంతపురం జిల్లాలో పిడుగులు పడే అవకాశం

image

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి పుట్టపర్తి, అనంతపురం తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని APSDMA హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెట్లు, టవర్లు, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదని ప్రజలను అప్రమత్తం చేస్తోంది. జిల్లా ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది.

Similar News

News November 11, 2024

26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు

image

SKU పరిధిలో డిగ్రీ విద్యార్థులకు ఈ నెల 26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ బీ.అనిత ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వివిధ కారణాల వలన పెండింగ్‌లో పడిన సబ్జెక్టులను పూర్తి చేసుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు డిసెంబర్ 23వ తేదితో ముగియనున్నట్లు పేర్కొన్నారు.

News November 11, 2024

మడకశిర సమీపంలో చిరుత మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.

News November 11, 2024

పయ్యావుల పద్దు.. అనంతపై కరుణ చూపేనా?

image

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉరవకొండ నుంచి 5వసారి గెలుపొంది తొలిసారి క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న పయ్యావుల కేశవ్ కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సూపర్-6 పథకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సుమారు ₹2.9లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడతారు. మన జిల్లా నేత బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. మరి పయ్యావుల పద్దులో అనంతపురానికి సరైన బెర్త్ దక్కేనా?