News October 28, 2024
అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టండి: నారా లోకేశ్
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టాలని టెస్లా సీఎఫ్‌వో వైభవ్ తనేజాను కోరారు. ఆస్టిన్‌లోని టెస్లా కార్యాలయంలో ఆ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. టెస్లా EV తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు అనంతపురం జిల్లా వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందని అన్నారు. 2029 నాటికి ఏపీలో 72గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
Similar News
News November 5, 2024
పోలీసుల గౌరవం పెంచడానికి ప్రభుత్వం కృషి: హోం మంత్రి
రాష్ట్రంలో పోలీసుల గౌరవాన్ని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో డీఎస్పీల పాసింగ్ అవుట్ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నామన్నారు. పోలీసు వ్యవస్థపై గురుతర బాధ్యత ఉన్నదని, అందరూ సమర్థవంతంగా పని చేయాలని కోరారు.
News November 5, 2024
నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లాలో త్వరలో నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు నిర్వహించనున్నామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలలో ఇరిగేషన్ అధికారులు ప్రతి ఉత్సాహం చూపకూడదని కలెక్టర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా జల వనరుల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి సంఘం ఎన్నికల మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
News November 5, 2024
కూటమి నాయకులతో ఇన్‌ఛార్జి మంత్రి సమీక్ష
కడప జిల్లాలోని ఎన్డీఏ కూటమి నాయకులతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. మంగళవారం కడపలోని రహదారులు భవనాల శాఖ అతిథి గృహం నందు ఎన్డీఏ కూటమి నాయకులతో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూటమినేతలు కలిసికట్టుగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు.