News February 27, 2026
అనంతపురం జిల్లాలో ప్రమాదం.. ఇద్దరి మృతి

అనంతపురం జిల్లా గుత్తి మండలం టి.కొత్తపల్లి సమీపంలోని 63వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఈసురాళ్లపల్లికి చెందిన బెస్త రంగస్వామి, బెస్త పవన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 20, 2026
జగిత్యాల: 1230 రోజుల తర్వాత ‘గులాబీ బాస్’ పర్యటన

దాదాపు 1230 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల పర్యటనకు రానున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పర్యటించిన ఆయన, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన చేసే వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులకు నాంది పలుకుతాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ రాకతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.
News April 20, 2026
సీఎం చంద్రబాబుపై సినిమా

AP: సీఎం చంద్రబాబు జీవితం, పరిపాలనా విశేషాలతో ‘ధర్మచక్రం’ సినిమాను నిర్మించినట్లు దర్శక, నిర్మాత పసుపులేటి వెంకట రమణ వెల్లడించారు. CBN బర్త్ డే సందర్భంగా ఇవాళ 13 జిల్లాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తామని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న సేవలను, ఆయనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఇందులో వాస్తవాలను చూపించామని పేర్కొన్నారు.
News April 20, 2026
చేతికి రెండు ఫ్రాక్చర్లు.. అయినా మూడు వికెట్లు

ఫామ్ లేమితో సతమతమైన KKR స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎట్టకేలకు నిన్న RRతో జరిగిన మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చారు. 4 ఓవర్లు వేసి 14 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అయితే IPL సీజన్‌కు ముందు తాను గాయపడ్డట్లు వరుణ్ తెలిపారు. ఇప్పటికీ లెఫ్ట్ హ్యాండ్‌లో 2 ఫ్రాక్చర్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఆ నొప్పితోనే బౌలింగ్ చేస్తున్నట్లు చెప్పారు. దాన్ని అధిగమించడానికే ట్రై చేస్తున్నట్లు తెలిపారు.


