News November 4, 2024
అనంతపురం జిల్లాలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ వీరికే!
అనంతపురం జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు 5,05,831 మంది అర్హత సాధించారు. వీరికి ప్రభుత్వం ఏడాదికి మూడు సిలిండర్లను అందజేస్తుంది. జిల్లాలో 1,61,437 మంది దీపం-2 పథకానికి అనర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఆధార్, రేషన్ కార్డు ప్రామాణికంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. లబ్ధిదారులకు సందేహాలుంటే 1967 నంబరుకు ఫోన్ చేయొచ్చు. ఇప్పటికే ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
Similar News
News December 9, 2024
పెనుకొండలో ప్రతిభా పరీక్షకు 58 మంది గైర్హాజరు
పెనుకొండ నగర పంచాయతీ పరిధిలో జాతీయ ఉపకార వేతనాల కోసం విద్యార్థులకు ఆదివారం ప్రతిభా పరీక్షలను నిర్వహించారు. పరీక్ష కేంద్రాలను మండల విద్యాధికారి చంద్రశేఖర్ తనిఖీ చేశారు. ఈ పరీక్షలను 4 కేంద్రాలలో నిర్వహించినట్లు మండల విద్యాధికారి తెలిపారు. నాలుగు కేంద్రాలలో మొత్తం 968 మంది అభ్యర్థులకు గానూ 910 మంది పరీక్షలకు హాజరయ్యారు. 58 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయినట్లు తెలిపారు.
News December 8, 2024
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం
శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వవచ్చునన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందన్నారు.
News December 8, 2024
అనంత జిల్లాలో 982 ఎం.వి కేసుల నమోదు
అనంతపురం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 982 ఎం.వీ కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ ఎం.వీ కేసులకు సంబంధించిన నిందితుల నుంచి రూ.2,21,625లు జరిమానా విధించారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు కేవలం ఒకరోజులోనే ప్రగతి సాధించారు. అంతే కాకుండా అలాగే ఓపెన్ డ్రింకింగ్ కేసులో 45, డ్రంకన్ డ్రైవ్ రెండు కేసులు, నమోదు చేశామన్నారు.