News December 4, 2024
అనంతపురం జిల్లాలో భూప్రకంపనల ప్రభావం లేదు!

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెలంగాణతో పాటు విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూ ప్రకంపనల ప్రభావం అనంతపురం జిల్లాపై లేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, 2017లో బెళుగుప్ప మండలం జీడిపల్లి, 2019లో ఉరవకొండ మండలం అమిద్యాలలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిన విషయం తెలిసిందే.
Similar News
News May 7, 2025
సెక్షన్ ఫారమ్ 8పై చర్చ: అనంత కలెక్టర్

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను సెక్షన్ ఫారమ్-8 కంపెనీగా నమోదు చేసే ప్రక్రియపై శనివారం చర్చ నిర్వహించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో JNTU వీసీ, సెంట్రల్ యూనివర్సిటీ VC, KIA ఇండియా, JSW అధికారులు పాల్గొన్నారు. సెక్షన్ ఫారమ్ 8 కంపెనీని ఏప్రిల్ 30లోపు నమోదు చేయాలన్నారు. టెండర్ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సమీక్షించి, అవసరమైన దశలను పరిశీలించారు.
News May 7, 2025
హైకోర్టు జడ్జ్‌కి స్వాగతం పలికిన అనంత కలెక్టర్

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జడ్జ్ జి.రామకృష్ణ ప్రసాద్‌కి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్వాగతం పలికారు. అనంతపురంలోని జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జ్, అనంతపురం జిల్లా పరిపాలనా న్యాయమూర్తి వర్క్‌షాప్ జరిగింది. ఇందులో ఎక్స్-అఫీషియో చైర్ పర్సన్ జడ్జ్ జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్ న్యాయాధికారులు పాల్గొన్నారు.
News May 7, 2025
పామిడి: బిడ్డకు ఐస్ తినిపిస్తున్న తల్లి కోతి.!

పామిడిలో తీవ్ర ఎండలకు మానవులతోపాటు పశు, పక్షాదులు తీవ్ర దాహంతో అల్లాడిపోతున్నాయి. దాహర్తిని తీర్చుకోవడానికి, మంచి నీటితోపాటు చల్లని పానీయాలతో ఐస్ క్రీమ్‌ల కోసం మనుషులు ఎగబడుతున్నారు. రహదారిపై ఐస్ తింటూ వెళ్లేవారి వద్ద ఐస్ లాక్కుని తల్లీ బిడ్డా ఐస్ తింటున్న ఫోటో ఇది.