News September 27, 2024

అనంతపురం జిల్లాలో మరో దారుణం.. చిన్నారిపై అఘాయిత్యం

image

అనంతపురం జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. పుట్లూరు మండలం శనగలగూడూరులో 10 ఏళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు తిరుపాలు అఘాయిత్యానికి యత్నించాడు. దీంతో తిరుపాలుకు గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News October 15, 2024

అనంతపురం జిల్లాలో రెండ్రోజులు సెలవులు

image

అనంతపురం జిల్లాకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఈ నెల16, 17న అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టల్స్‌లకు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఫోన్ చేయాలని అన్నారు.

News October 15, 2024

పూడికతీత పనులను పరిశీలించిన అనంతపురం కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో అనంతపురంలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ డా.వినోద్ కుమార్ పర్యటించారు. నగరంలోని రజాక్ నగర్, సోమనాథ్ నగర్, ఐదు, ఆరో రోడ్లలో, యువజన కాలనీ, నారాయణ కళాశాల, త్రివేణి టాకీస్, అశోక్ నగర్ బ్రిడ్జి, ఎంజీ కాలనీ, ఖాగానగర్, హౌసింగ్ బోర్డుల్లో ఉన్న నడిమివంక, మరువవంకలో పూడికతీత పనులను పర్యవేక్షించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.

News October 14, 2024

అనంత, సత్యసాయి జిల్లాలకు భారీ వర్ష సూచన

image

అల్పపీడన ప్రభావంతో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రేపు శ్రీ సత్యసాయి జిల్లా, బుధ, గురువారాల్లో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల పోలీసు, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత ఆదేశించారు.