News February 23, 2025
అనంతపురం జిల్లాలో 14 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. అనంతపురం జిల్లాలో 14 కేంద్రాల్లో 7,293 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.
Similar News
News February 23, 2025
అనంతపురం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు ఇవే..!

☞ అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు – కలెక్టర్ వినోద్ కుమార్ ☞ పెద్దపప్పూరులో అశ్వర్థం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు ☞ అనంతపురం రూరల్‌లో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సునీత భూమి పూజ☞ గుత్తిలో ఇరు వర్గాలు ఘర్షణ ☞ కుందుర్పిలో గడ్డివాములు దగ్ధం ☞ గార్లదిన్నె మండలంలో రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు☞ తాడిపత్రిలో సింహ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి
News February 23, 2025
6,463 మంది పరీక్షలు రాశారు: అనంత కలెక్టర్

అనంతపురం జిల్లాలోని 14 సెంటర్లలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మొదటి పేపర్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మొత్తం 7,293 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. అందులో 6,463 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని, 830 మంది అభ్యర్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. 88.61% ప్రజెంట్ పోల్ అయినట్లు ఆయన తెలిపారు.
News February 23, 2025
చెన్నేకొత్తపల్లి: పాము కాటుకు గురై చిన్నారి మృతి

చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురానికి చెందిన ప్రీతి అనే మూడో తరగతి విద్యార్థిని శనివారం రాత్రి పాముకాటుకు గురై మృతి చెందారు. శనివారం రాత్రి ప్రీతి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా.. నాగుపాము కాటు వేయడంతో ఆమెను తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విద్యార్థిని తల్లితండ్రులు తెలిపారు.