News February 23, 2025

అనంతపురం జిల్లాలో 14 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష

image

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో 9,993 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.

Similar News

News September 15, 2025

జాతీయ జెండా ఆవిష్కరించనున్న ప్రభుత్వ విప్ అది

image

సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో జరిగే కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం, ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

News September 15, 2025

ప్రియుడితో నటి ఎంగేజ్‌మెంట్?

image

రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రచిత్‌ సింగ్‌తో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. యాక్టింగ్ కోచ్‌ అయిన రచిత్‌తో హుమా ఏడాదికి పైగా డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు పలు సందర్భాల్లో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఈక్రమంలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటిపై హుమా స్పందించాల్సి ఉంది.

News September 15, 2025

ANU: ఏపీ పీజీ సెట్ షెడ్యూల్ మార్పు

image

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీ పీజీ సెట్ – 2025 షెడ్యూల్‌లో మార్పులు జరిగాయని కన్వీనర్ ప్రొఫెసర్ రవికుమార్ తెలిపారు. వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 17 వరకు, ఆన్‌లైన్ సర్టిఫికెట్ ధ్రువీకరణను 18 వరకు పొడిగించినట్లు ఆయన చెప్పారు. వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఈ నెల 20 వరకు జరుగుతుందని పేర్కొన్నారు.