News February 23, 2025
అనంతపురం జిల్లాలో 14 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. అనంతపురం జిల్లాలో 14 కేంద్రాల్లో 7,293 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.
Similar News
News March 21, 2025
ATP: శక్తి మొబైల్ యాప్ మహిళలకు రక్ష: ఎస్పీ

ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్న శక్తి మొబైల్ యాప్‌ను ప్రతి మహిళ తమ మొబైల్ ఫోనులో డౌన్లోడు చేసుకొని రిజిస్ట్రేషను చేసుకోవాలని జిల్లా ఎస్పీ జగదీష్ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఆపద సమయాలలో మహిళలకు ఈ యాప్ కుటుంబ సభ్యుల్లా ఎంతో సహాయపడుతుందన్నారు. ఆపద వేళల్లో యాప్‌లోని SOS బటన్‌ను ప్రెస్ చేస్తే క్షణాల్లో పోలీసు బృందం తామున్న ప్లేస్‌కి చేరుకొని రక్షిస్తుందన్నారు.
News March 21, 2025
ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

వేసవి నేపథ్యంలో ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. తలనొప్పి, తల తిరగటం, తీవ్రమైన జ్వరం కలిగియుండటం, మత్తు నిద్ర కలవరింతలు, ఫిట్స్, లేదా పూర్తి అపస్మారక స్థితి ఉంటుందని, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తెలుపు రంగు గల కాటన్ వస్త్రాలను ధరించాలని అన్నారు. తలకు టోపి పెట్టుకోవాలని, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోస్ కలిపిన నీటిని తాగాలని సూచించారు.
News March 21, 2025
అనంత జిల్లాలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

అనంతపురం జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నట్లు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త విజయ శంకర్ బాబు తెలిపారు. 5 రోజులలో ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. 14న 40.4°, 15న 39.8°, 16న 39.2°, 17న 40.7°, 18న 39.2°, 1940.7°, 20న 41.1° డిగ్రీలు నమోదు అయ్యాయని వివరించారు. వేసవి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.