News January 29, 2025
అనంతపురం జిల్లాలో 3,572 కేసులు

అనంతపురం జిల్లా ప్రజలు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ జగదీశ్ కోరారు. వారం రోజుల నుంచి పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. 3,572 కేసులు నమోదు చేసి, రూ.7,24,905 జరిమానా విధించినట్లు తెలిపారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 319 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News November 30, 2025
2,81,298 మందికి పెన్షన్ పంపిణీ పంపిణీకి సిద్ధం: కలెక్టర్

అనంతపురం జిల్లాలో 2,81,298 మంది NTR భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు రూ.125.39 కోట్లు పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద తెలిపారు. డిసెంబర్ 1న ఉదయం 6:30 గంటలకు పెన్షన్ లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగస్థులు పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. పెన్షన్ పంపిణీ విధానాన్ని DLDO, MPDO, మున్సిపల్ కమిషనర్లు పరిరక్షించాలని ఆదేశించారు.
News November 29, 2025
భూ సేకరణ భూబధాలయింపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఆయా ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ బదలాయింపు 15 రోజుల లోపల పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ బదలాయింపుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా శాఖల అధికారులు ప్రతిరోజూ మానిటర్ చేయాలన్నారు. సమయపాలన ప్రకారం భూ సేకరణ బదలాయింపు పూర్తి చేయాలన్నారు.