News October 7, 2024
అనంతపురం జిల్లాలో 421 దరఖాస్తులు!
అనంతపురం జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు అనంతపురం జిల్లాలో 136 మద్యం దుకాణాలకు గానూ 289, సత్యసాయి జిల్లాలో 87 దుకాణాలకు గానూ 132 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు ఇక మూడు రోజులే గడువుంది. అయితే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు వేయొద్దని, వాటిని తమకు వదిలేయాలని వ్యాపారులను హెచ్చరిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.
Similar News
News December 22, 2024
బీసీ వసతి గృహ విద్యార్థి అదృశ్యం.. మంత్రి సవిత ఫైర్
శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని కదిరి బీసీ వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న జగదీశ్ నాయక్ అదృశ్యం కావడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థిని వెతికి పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. తనకల్లు మండలం రత్నా నాయక్ తండాకు చెందిన జగశ్ష్ నాయక్ శనివారం ఉదయం అదృశ్యమైనట్టు తోటి విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థుల కదిలికపై కన్నేసి ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
News December 22, 2024
జాతి వైర్యాన్ని మరిచి తల్లి ప్రేమను చాటిన వరాహం
రాయదుర్గంలో జాతి వైర్యాన్ని సైతం మరిచి ఓ వరాహం శునకం పిల్లలకు పాలు ఇచ్చి అమ్మతనాన్ని చాటుకుంది. కోటలో శంకరమఠం ఆలయం సమీపాన ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ప్రజలు ఈ ఘటన చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతున్న నేపథ్యంలో ఈ ఘటన ఆశ్చర్యానికి గురిచేసిందని స్థానికులు తెలిపారు.
News December 22, 2024
రౌడీషీటర్లు, చెడునడత కల్గిన వారిపై ప్రత్యేక నిఘా కొనసాగించండి: ఎస్పీ
రౌడీషీటర్లు, చెడునడత కల్గిన వారిపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశించారు. కసాపురం పోలీస్ స్టేషన్లో శనివారం ఆయన వార్షిక తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్ కౌంటర్ను, లాకప్ గదులను, కంప్యూటర్ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల సీడీ ఫైల్స్ను పరిశీలించి, ఆయా కేసుల పురోగతిని తెలుసుకుని తగు సూచనలు చేశారు.