News February 24, 2025
అనంతపురం జిల్లాలో 48,690 మంది ఇంటర్ విద్యార్థులు

మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అనంతపురం జిల్లాలో 48,690 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం 25,730 మంది, రెండో సంవత్సరం 22,960 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదలయ్యాయి.
Similar News
News March 25, 2025
తాడిపత్రిలో పెద్దారెడ్డికి నో ఎంట్రీ బోర్డ్!

తాడిపత్రి నియోజకవర్గంలోని YCP శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. కీలక నేతలంతా యాక్టివ్‌గా లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలూ పెద్దగా జరగడంలేదు. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా తనను తాడిపత్రికి వెళ్లకూడదంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. 9నెలల నుంచి ఇదే సాగుతోంది. ఆయన నియోజకవర్గానికి రావాలనుకుంటున్నా రాలేకపోతున్నారు. మరోవైపు దూకుడుతో JC తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
News March 25, 2025
MMTS ఘటన.. నిందితుడి కోసం ప్రత్యేక బృందాల

హైదరాబాద్‌లోని MMTS <<15866506>>రైలు<<>> మహిళా కోచ్‌లో ఒంటరిగా ఉన్న అనంతపురం జిల్లా యువతి (23)పై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు అన్ని రైల్వే స్టేషన్లలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. యువకుడి వయసు 25ఏళ్లు ఉంటుందని అంచనాకు వచ్చిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
News March 25, 2025
అనంత: పరిష్కార వేదికకు 63 పిటిషన్లు.!

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జగదీశ్ పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం PGRC కార్యక్రమంలో 63 పిటీషన్లు వచ్చినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎస్పీ స్వయంగా వారి సమస్యను విని, సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించి, వారి సమస్యను పరిష్కరించాలని పోలీసులకు ఆయన సూచించారు.