News April 3, 2025

అనంతపురం జిల్లాలో 89 మంది కానిస్టేబుళ్ల బదిలీ

image

అనంతపురం జిల్లాలో బుధవారం కానిస్టేబుళ్ల బదిలీలు పారదర్శకంగా జరిగాయి. ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి 89 మందిని బదిలీ చేశారు. సీనియార్టీ ఆధారంగా సిబ్బంది కోరుకున్న చోటుకే స్థాన చలనం కల్పించారు. పట్టణాల్లో పని చేస్తున్న వారిని రూరల్ పోలీసు స్టేషన్లకు, రూరల్ ఏరియాలలో పని చేస్తున్న వారిని పట్టణ ప్రాంతాల స్టేషన్లకు బదిలీ చేశారు. 89 మందికి అక్కడికక్కడే బదిలీ ఉత్తర్వు ప్రతిని అందజేశారు.

Similar News

News April 11, 2025

రేపే రిజల్ట్.. అనంతపురం జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతపురం జిల్లాలో ఫస్టియర్ 25,730 మంది, సెకండియర్ 22,960 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 11, 2025

రేపే రిజల్ట్.. అనంతపురం జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతపురం జిల్లాలో ఫస్టియర్ 25,730 మంది, సెకండియర్ 22,960 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 11, 2025

రామగిరి ఎస్ఐ దాచింది.. దోచింది ఎక్కువే: వైసీపీ

image

రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్‌పై వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. ‘ఆయనను చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఒకసారి సస్పెండ్ అయిన సుధాకర్ తెలుగుదేశం కార్యకర్త కన్నా ఎక్కువ ఉత్సాహంగా పార్టీ కోసం పని చేస్తున్నారని అంటున్నారు. పరిటాల సునీత అండతో అరాచక శక్తిగా ఎదిగిన సుధాకర్ దాచింది.. దోచింది ఎక్కువే అని చర్చలు నడుస్తున్నాయి’ అంటూ ట్వీట్ చేసింది.

error: Content is protected !!