News August 29, 2024
అనంతపురం జిల్లాలో 9 ఎఫ్ఎం రేడియో స్టేషన్లు

అనంత జిల్లాలో కొత్తగా తొమ్మిది ఎఫ్ఎం రేడియో స్టేషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా 234 నగరాలు, పట్టణాల్లో ఎఫ్ఎం రేడియోను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గం తెలిపింది. అందులో భాగంగా జిల్లాకు 9 ఎఫ్ఎం రేడియో స్టేషన్లను కేటాయించారు. జిల్లాలోని అనంతపురంలో 3, గుంతకల్లులో 3, తాడిపత్రిలో 3 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 1, 2025
నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి

ఉరవకొండ మండలం బూదిగవిలో రూ.43.75 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.
News November 30, 2025
2,81,298 మందికి పెన్షన్ పంపిణీ పంపిణీకి సిద్ధం: కలెక్టర్

అనంతపురం జిల్లాలో 2,81,298 మంది NTR భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు రూ.125.39 కోట్లు పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద తెలిపారు. డిసెంబర్ 1న ఉదయం 6:30 గంటలకు పెన్షన్ లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగస్థులు పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. పెన్షన్ పంపిణీ విధానాన్ని DLDO, MPDO, మున్సిపల్ కమిషనర్లు పరిరక్షించాలని ఆదేశించారు.
News November 29, 2025
భూ సేకరణ భూబధాలయింపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఆయా ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ బదలాయింపు 15 రోజుల లోపల పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ బదలాయింపుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా శాఖల అధికారులు ప్రతిరోజూ మానిటర్ చేయాలన్నారు. సమయపాలన ప్రకారం భూ సేకరణ బదలాయింపు పూర్తి చేయాలన్నారు.


