News April 2, 2025
అనంతపురం జిల్లాలో HM సస్పెండ్

అనంతపురం జిల్లా ఆత్మకూరు ZPHS హెచ్‌ఎం శ్రీనివాస్ ప్రసాద్‌పై పాఠశాల విద్య కడప RJD శామ్యూల్ మంగళవారం సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు ZPHSలో పరీక్ష రాసేందుకు 10th విద్యార్థిని వెళ్లింది. పరీక్ష జరిగే సమయంలో ఆ విద్యార్థిని ప్రశ్నాపత్రం మిస్ అయిందని చెప్పగా.. చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆమెను భుజంపై కర్రతో కొట్టారు. దీంతో విద్యార్థిని కాలర్ బౌన్ విరిగగా ఆయనను సస్పెండ్ చేశారు.
Similar News
News April 23, 2025
నేడే రిజల్ట్.. అనంతపురం జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అనంతపురం జిల్లాలో 32,803 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 23, 2025
పథకాల అమలు పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్ డా.వినోద్ కుమార్

ప్రభుత్వ పథకాలు, వివిధ సేవలను పారదర్శకంగా ప్రజలకు అందించాలని, వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురంలోని కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ సేవలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని తెలిపారు.
News April 22, 2025
ఇంటర్ ఫలితాల్లో అనంతపురం యువతికి 981 మార్కులు

శెట్టూరు మండలం బసంపల్లి గ్రామానికి చెందిన పాలబండ్ల హనుమంతరెడ్డి, పాలబండ్ల కుమారి దంపతుల కుమార్తె శశిలేఖ తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదివిన యువతి ఎంపీసీలో 1000 మార్కులకు గానూ 981 మార్కులు సాధించారు. శశి లేఖని ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు అభినందించారు.