News August 31, 2024
అనంతపురం జిల్లాలో TODAY TOP NEWS

☞ ఆత్మకూరులో పర్యటించిన కలెక్టర్ వినోద్ కుమార్ ☞ భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు ☞ దులీప్ క్రికెట్ ట్రోపీకి ఎంట్రీ పాసుల పంపిణీ ☞ అనంత జిల్లాలో వర్షంలోనూ పింఛన్ పంపిణీ ☞ గుత్తిలో గ్యాస్ సిలిండర్ లీక్.. పరుగులు తీసిన జనాలు ☞ అనంత జిల్లాలో 206.8 మిల్లీమీటర్ల వర్షపాతం ☞ ఉరవకొండలో విద్యుత్ షాక్ తో రైతు మృతి ☞ పెన్నాహోబిలంలో ఘనంగా శ్రీవారి పల్లకి ఉత్సవం ☞ భక్తులతో కిటకిటలాడిన కసాపురం క్షేత్రం.
Similar News
News February 9, 2025
అదుపుతప్పి కారు బోల్తా.. మహిళ మృతి

కర్నూలు(D) వెల్దుర్తిలోని మంగంపల్లి సమీపాన శనివారం కారు బోల్తాపడి మహిళ మృతిచెందింది. సత్యసాయి(D) బత్తలపల్లి(M) గుమ్మలకుంటకు చెందిన పవన్ కుమార్ రెడ్డి, మహేశ్వరి(32) HYDలో ఉంటున్నారు. తమ్ముడి వివాహానికి ఏడాదిన్నర కుమారుడు వియాన్స్, మరిది అమర్‌నాథ్‌తో కలిసి కారులో బయలుదేరారు. మంగంపల్లి వద్ద కుక్క అడ్డురావడంతో బోల్తాపడింది. తన ఒడిలో ఉన్న వియాన్స్‌ను అదిమి పట్టుకుని ప్రాణాలు కాపాడి, తాను మృతిచెందింది.
News February 9, 2025
పేరూరు గ్రామం నుంచి తిరుమలకు పాదయాత్ర

పేరూరు గ్రామం నుంచి తిరుమలకు పంచాగం మోహన్ స్వామి ఆధ్వర్యంలో భక్తులు శనివారం పాదయాత్రను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి మాల ధరించిన భక్తులు గ్రామంలోని ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసి, భజన చేసుకుంటూ తిరుమలకు పాదయాత్ర చేస్తామన్నారు. కార్యక్రమంలో దాసరి రాజ, వెంకటరెడ్డి, బెస్త నాగరాజు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
News February 8, 2025
మరుట్లలో 400 చీనీ చెట్లకు నిప్పు

కూడేరు మండలంలోని మరుట్ల రెండో కాలనీ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చిన్నకొండప్ప గారి శ్రీనివాస్ నాయుడు తోటలో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 400 చీనీ చెట్లు దగ్ధమయ్యాయి. డ్రిప్ పరికరాలు, పైప్లైన్ గేట్ వాల్స్ మొత్తం కాలి బూడిద అయ్యాయి. దాదాపుగా రూ.4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు తెలిపాడు.