News January 28, 2025

అనంతపురం జిల్లా కలెక్టర్‌కు సత్కారం

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో మంగళవారం ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌కు చిరు సత్కారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా.. ఉత్తమ ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అవార్డు అందుకున్న విషయం విధితమే. ఏపీ జేఏసీ అమరావతి కమిటీ సభ్యులు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News February 13, 2025

తాడిపత్రిలో శివలింగం కింద నీటిని ఎప్పుడైనా చూశారా!

image

అనంతపురం జిల్లాలో దక్షిణ కాశీగా పిలవబడుతూ తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రానికి ఓ విశిష్టత ఉంది. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. అయితే అలంకరణలో ఉన్న సమయంలో దర్శనానికి వెళ్లే భక్తులకు ఆ దృశ్యాన్ని చూసే భాగ్యం కలగదు. పై ఫొటోలో శివలింగం కింద నీటిని స్పష్టంగా చూడొచ్చు.

News February 13, 2025

విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్: ఆలూరు సాంబ

image

విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ సీనియర్ నేత ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడని ప్రజలు నమ్మి ఓటు వేశారని, అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.

News February 13, 2025

‘99.97 పర్సంటేజ్‌తో శింగనమల విద్యార్థి సత్తా చాటాడు’

image

శింగనమల మండలం బండమీద పల్లికి చెందిన శెట్టిపల్లి శశిధర్ రెడ్డి జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ చూపారు. 99.97 పర్సంటేజ్‌తో సాధించారు. 1వ తరగతి నుంచి వరకు 10వ తరగతి వరకు అనంతపురం నారాయణ స్కూల్లో చదివారు. ఇంటర్ హైదరాబాద్‌లో చదువుతున్నాడు. ప్రతిభ చూపిన విద్యార్థిని గ్రామస్థులు, తల్లితండ్రలు అభినందించారు.

error: Content is protected !!