News February 22, 2025
అనంతపురం జిల్లా నేటి ముఖ్యాంశాలు ఇవే

☞ గుత్తి వద్ద టూరిస్ట్ బస్సు బోల్తా.. 20 మంది గాయాలు☞అనంతపురం పెట్రోల్ బంక్ లో మోసం..రూ.2.9 కోట్ల మేర మోసం ☞ తాడిపత్రిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ద్వజారోహణం కార్యక్రమం ☞ టమోటా రైతులు అధైర్యపడవద్దు-ఎమ్మెల్యే పరిటాల సునీత ☞అనంతపురంలో గ్రూప్ 2 వాయిదా నిరసన ☞ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ లక్ష్మీనారాయణ
Similar News
News March 28, 2025
వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా పెన్నోబులేసు

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా మాల్యావంతం పెన్నోబులేసును నియమించారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు జగన్మోహన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
News March 28, 2025
ఎన్టీఆర్ పింఛన్లకు రూ.127.76 కోట్లు మంజూరు

అనంతపురం జిల్లాలో ఏప్రిల్ 1న పంపిణీ చేయనున్న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీకి రూ.126.76 కోట్లు నిధులు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 2,79,165 మంది లబ్దిదారులకు పింఛన్లు ఇంటి వద్ద పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. మొదటి రోజు సాంకేతిక కారణాలతో పంపిణీ జరగకుంటే రెండవ రోజు తప్పనిసరిగా ఇంటివద్ద అందిస్తారని పేర్కొన్నారు.
News March 27, 2025
లేపాక్షి: పరీక్షలు సరిగా రాయలేదనే భయంతో..

లేపాక్షి మండలం పులమతి సడ్లపల్లికి చెందిన బాబు అనే విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాబు పదో తరగతి పరీక్షలు సరిగా రాయలేదని, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇంట్లో ఇబ్బంది కలుగుతుందనే భయంతో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు బాబును హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.