News December 19, 2024

అనంతపురం జిల్లా నేతలకు జగన్ దిశానిర్దేశం

image

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగింది. జిల్లాలోని నియోజకవర్గ బాధ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలోని రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో చేయబోయే ధర్నాలు, పార్టీ కార్యక్రమాలు, పలు అంశాలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్‌ దిశానిర్దేశం చేశారు.

Similar News

News January 21, 2025

కడప SPగా నార్పల గ్రామ వాసి

image

కడప జిల్లా ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా నార్పల గ్రామం. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ 2010లో డీఎస్పీగా విధుల్లో చేరారు. నాగర్ కర్నూల్, చింతలపల్లె, కడపలో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. 2018లో ఏఎస్పీగా ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న క్రమంలో ప్రమోషన్‌పై ఇటీవల ఎస్పీగా పదోన్నతి రావడంతో మొదటి పోస్టింగ్ కడపకు ఇచ్చారు.

News January 21, 2025

ఆంధ్ర రంజీ జట్టుకు అనంత జిల్లా కుర్రాడు

image

అనంతపురం జిల్లాకు చెందిన వినయ్ కుమార్ ఆంధ్ర రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. అనంతపురం మండలం కురుగుంటకు చెందిన వినయ్ కుమార్.. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. ఇప్పటికే పలు ట్రోఫీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రంజీ జట్టుకు వినయ్ కుమార్ ఎంపిక కావడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News January 21, 2025

శ్రీ సత్యసాయి జిల్లా వ్యక్తికి అండగా నారా లోకేశ్

image

శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండల టీడీపల్లికి చెందిన చంద్రప్ప తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. పేద కుటుంబం కావడంతో ఆదుకోవాలంటూ ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా మంత్రి నారా లోకేశ్‌ను కోరారు. స్పందించిన మంత్రి చంద్రప్పకు అవసరమైన సహాయాన్ని తన టీమ్ వెంటనే అందజేస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు చికిత్స కోసం రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు.