News September 23, 2024
అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓగా రామచంద్రారెడ్డి
అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓగా రామచంద్రారెడ్డి నియమిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీఈఓగా పనిచేస్తున్న ఓబులమ్మను కడప జిల్లా పరిషత్ సీఈవోగా బదిలీ చేశారు. రామచంద్రారెడ్డి ప్రస్తుతం నంద్యాల జిల్లా DWMAలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు.
Similar News
News October 9, 2024
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించండి: బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి
మాజీ సీఎం జగన్ X వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ‘2011లో ప్రారంభమైన YCP నుంచి ఇప్పటివరకు 35 మంది MPలు, 232 మంది MLAలు గెలిచారు. ఇప్పుడు మీరు నిందిస్తున్న EVMల వల్లే గెలిచి మీరు CM అయ్యారు. మీ పాలనలో చేసిన తప్పులను దాచడానికి ప్రయత్నించడం మానేయండి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, వాస్తవాలను గ్రహించి, ఆరోపణలు మానుకోండి’ అని పేర్కొన్నారు.
News October 9, 2024
డీసీఆర్సీ విభాగం సిబ్బందితో సమీక్ష నిర్వహించిన ఎస్పీ
శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో డీసీఆర్సీ విభాగం సిబ్బందితో జిల్లా ఎస్పీ రత్న సమీక్ష నిర్వహించారు. ఎస్పీ కార్యాలయంలో డిసిఆర్బి శాఖ ఎంతో కీలకమైనదని అన్ని కేసులపై అవగాహన పెంచుకొని పనిచేయాలని ఎస్పీ సూచించారు. క్రైమ్ కేసులతోపాటు ఎస్సీ ఎస్టీ, లోకాయుక్త, రౌడీషీటర్స్, చోరీలు, బోర్డర్ పోలీస్ స్టేషన్, క్రిమినల్స్, ఫ్యాక్షన్ గ్రామాలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు.
News October 9, 2024
ఎస్‌కే యూనివర్సిటీ పరీక్ష ఫలితాల విడుదల
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో సెకండ్ సెమిస్టర్ UG రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రొఫెసర్ శోభలత కమిటీ సభ్యులు ఎస్కే ఛాంబర్‌లో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ వెంకటనాయుడు, రిజిస్టార్ రమేశ్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారి లోకేశ్వర్, అసిస్టెంట్ రిజిస్టర్ శంకర్ పాల్గొన్నారు.