News November 23, 2024

అనంతపురం జిల్లా ప్రజలకు గమనిక

image

ఓటు నమోదుకు నేడు, రేపు ప్రత్యేక ప్రచార క్యాంపులు నిర్వహించనున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి 2025 జనవరి 1వ తేదీ నాటికి వయసు 18 ఏళ్లు నిండిన లేదా నిండనున్న వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి గ్రామంలోని బీఎల్వోలు వద్ద నేడు, రేపు దరఖాస్తు ఫారాలు ఉంటాయని.. సంప్రదించి ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు.

Similar News

News December 8, 2024

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం

image

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వవచ్చునన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందన్నారు.

News December 8, 2024

అనంత జిల్లాలో 982 ఎం.వి కేసుల నమోదు

image

అనంతపురం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 982 ఎం.వీ కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ ఎం.వీ కేసులకు సంబంధించిన నిందితుల నుంచి రూ.2,21,625లు జరిమానా విధించారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు కేవలం ఒకరోజులోనే ప్రగతి సాధించారు. అంతే కాకుండా అలాగే ఓపెన్ డ్రింకింగ్ కేసులో 45, డ్రంకన్ డ్రైవ్ రెండు కేసులు, నమోదు చేశామన్నారు.

News December 8, 2024

యువతిపై కత్తితో దాడి.. మంత్రి సవిత సీరియస్

image

కడప జిల్లా వేములలో యువతిపై ఉన్మాది కత్తితో దాడి చేసిన ఘటనపై ఇన్‌ఛార్జి <<14821476>>మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం<<>> వ్యక్తం చేశారు. ఇన్‌ఛార్జి ఎస్పీ విద్యాసాగర్‌తో ఫోన్లో మాట్లాడి, తక్షణమే నిందితుడిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. కఠిన శిక్ష పడేలా చూడాలని, బాధిత యువతికి మెరుగైన వైద్యమందించాలని తిరుపతి రుయా వైద్యులను మంత్రి సవిత సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందనీ హామీ ఇచ్చారు.