News October 24, 2024

అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారిగా మలోలా

image

అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారిగా మలోలాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డీఆర్ఓగా ఉన్న రామకృష్ణారెడ్డిని సచివాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం డీఆర్ఓగా వస్తున్న మలోలా గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్టీఓగా విధులు నిర్వహించారు.

Similar News

News November 12, 2024

అపార్ సకాలంలో జరగకపోతే కఠిన చర్యలు: కలెక్టర్ వినోద్

image

జిల్లాలో అపార్ జనరేషన్ సకాలంలో పూర్తిగా జరగకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో పాఠశాల విద్యా శాఖపై విద్యా, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పాఠశాలలోనే నిర్వహించాలని ఆదేశించారు.

News November 12, 2024

అనంతపురం-తాడిపత్రి మధ్య ఎయిర్ స్ట్రిప్!

image

రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. కుప్పం, దగదర్తి, మూలపేటల్లో విమానాశ్రయాలు, అనంతపురం-తాడిపత్రి మధ్య ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో కదలిక కోసం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.792.72 కోట్లు కేటాయించింది. దీంతో ఆయా చోట్ల అనుకూలతలపై త్వరలో కేంద్రం అధ్యయనం చేయనుంది.

News November 12, 2024

కేశవ్ పద్దు.. అనంతపురం జిల్లా సాగునీటి రంగానికి ఊతం

image

➤ హంద్రీనీవాకు రూ.1,867 కోట్లు
➤ HLC ఆధునికీకరణ పనులకు ₹30 కోట్లు
➤ జిల్లా సాగునీటి రంగానికి ₹2వేల కోట్లు
➤ SKUకు రూ.100 కోట్లు, JNTUకు రూ.58కోట్లు
➤ రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రూ.19కోట్లు
➤ బిందు సేద్యం ప్రోత్సాహానికి ₹2,700కోట్ల నిధులు
➤ అన్నదాత సుఖీభవ పథకానికి ₹4,500 కోట్లు
☞ జిల్లాలోని 5లక్షల మంది రైతులకు లబ్ధి
➤ తల్లికి వందనం పథకానికి రూ.6వేల కోట్లు
☞ ఉమ్మడి జిల్లాలో 4 లక్షల మంది లబ్ధిదారులు