News November 21, 2024
అనంతపురం జిల్లా వాసులను వెంటాడుతోన్న మృత్యువు
అనంత జిల్లా వాసులను విద్యుత్ ప్రమాదాల రూపంలో మృత్యువు వెంటాడుతోంది. ఐదేళ్లలో విద్యుత్ ప్రమాదాల కారణంగా వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిన్న విద్యుత్ తీగలు తెగిపడి తండ్రి, కొడుకు మరణించారు. 2022లోనూ దర్గాహొన్నూర్‌లో పనులకు వెళ్తున్న కూలీల ట్రాక్టర్‌పై తీగలు తెగిపడి ఆరుగురు మరణించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News December 26, 2024
30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు: అనంత ఎస్పీ
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి జనవరి 17 వరకు నీలం సంజీవరెడ్డి మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పురుషులు 5,242, మహిళలు 1,237 మంది హాజరవుతారని అన్నారు.
News December 26, 2024
ధాన్యం కొనుగోలు కొనసాగించండి: రాయదుర్గం ఎమ్మెల్యే
అనంతపురం జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని, ప్రభుత్వం ప్రకటించిన ధరతో సకాలంలో కొనుగోలు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులను ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం ఆయన సంబంధిత అధికారులు డీఎం రమేశ్ రెడ్డి, ప్రసాద్ బాబు, డీటీ సుబ్రహ్మణ్యంలతో ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. రాయదుర్గం, శింగనమల నియోజకవర్గాలలో గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
News December 26, 2024
నల్లచెరువు: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
నల్లచెరువు మండలం పరిధిలోని కే పూలకుంట గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన హరి(33) అనే యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.