News March 23, 2024

అనంతపురం జిల్లా వ్యాప్తంగా రిటర్నింగ్ అధికారుల నియామకం

image

అనంతపురం జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ గౌతమి ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి అనంతపురం అర్బన్‌కి వెంకటేష్, రాప్తాడుకి వసంతబాబు, ఉరవకొండకి కేతన్ గార్గ్, రాయదుర్గానికి కరుణకుమారి, శింగనమలకి వెన్నెల శ్రీను, తాడిపత్రికి రాంభూపాల్ రెడ్డి, కళ్యాణదుర్గంకి రాణి సుష్మిత, గుంతకల్లుకి శ్రీనివాసులు రెడ్డిలను నియమించారు.

Similar News

News October 6, 2024

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు విద్యార్థినుల ఎంపిక

image

పుట్టపర్తి మండలంలోని జగరాజుపల్లి ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థినులు అండర్-14 విభాగంలో హ్యాండ్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రమేశ్ బాబు, పీడీ అజీమ్ బాషా తెలిపారు. అనంతపురం జిల్లాస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచిన ఓం శ్రీ, ఫర్హాన్ అనే విద్యార్థినులు ఎంపిక అయ్యారన్నారు.

News October 6, 2024

రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలచే వినతి పత్రాలు తీసుకుంటామన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

News October 6, 2024

రేపు JNTUలో MBA, MCA స్పాట్ అడ్మిషన్లు

image

అనంతపురం జేఎన్టీయూలో MBA, MCA స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ కిరణ్మయి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి MBAలో 9 సీట్లు, MCAలో 4 సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు యూనివర్సిటీలోని పరిపాలన భవనం నందు సోమవారం ఉదయం 9.00 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.