News September 30, 2024

అనంతపురం: జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపిక

image

అనంతపురంలోని సెయింట్ జాన్స్ స్కూల్ పాఠశాల మైదానంలో ఆదివారం జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. 80 మంది బాల, బాలికలు పాల్గొన్నారు. జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. 12 మంది బాలురు, 12 మంది బాలికలు ఎంపికయ్యారన్నారు. అక్టోబర్ 6, 7వ తేదీల్లో కర్నూలు జిల్లా సీ.బెలగల్ ప్రభుత్వ పాఠశాలలో జరగనున్న అంతర్ జిల్లా ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

Similar News

News October 11, 2024

హిందూపురం ప్రభుత్వ టీచర్‌కు 6 నెలల జైలు శిక్ష

image

హిందూపురానికి చెందిన ఓ మహిళా ఉపాధ్యాయినికి చెక్ బౌన్స్‌ కేసులో పెనుకొండ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల మేరకు.. 2022లో గుట్టూరుకు చెందిన ఈశ్వరమ్మకు హిందూపురానికి చెందిన ఓ ఉపాధ్యాయిని డబ్బు ఇవ్వాల్సి ఉండగా చెక్‌ ఇచ్చింది. అది బౌన్స్‌ కావడంతో కొంతకాలం తర్వాత ఈశ్వరమ్మ కోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా గురువారం కోర్టు తీర్పు వెల్లడించింది.

News October 11, 2024

దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి: కలెక్టర్

image

చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్కరి కుటుంబానికి విజయాలు వరించాలన్నారు. జిల్లా ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలను మంత్రి తెలిపారు.

News October 10, 2024

ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

image

కనగాణపల్లి మండలంలోని కేజీబీవి బాలికల పాఠశాలలో ఖాళీగా బోధనేతర ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. పాఠశాలలో హెడ్ కుక్ పోస్టు 1, అసిస్టెంట్ కుక్ 1, చౌకిదర్ పోస్టు 1 ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈనెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.