News December 24, 2024
అనంతపురం జైలుకు తెలంగాణ యువకుడు
సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టిన తెలంగాణ యువకుడు విజయ్‌ను అనంతపురం గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడిని జైలుకు తరలించారు. కాగా సీఎం కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నాడంటూ టీఎన్ఎస్ఎఫ్ నేత మహమ్మద్ రఫీ ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Similar News
News December 25, 2024
గుత్తి: లారీ ఢీకొని ఒకరు మృతి
గుత్తి మండలం తొండపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అదుపు తప్పి అతివేగంగా రోడ్డు పక్కన ఉన్న వాటర్ ప్లాంట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గుత్తి మండలం ఎంగన్నపల్లికి చెందిన భాస్కర్(24) మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ సురేష్ స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు.
News December 25, 2024
ATP: విద్యుత్ షాక్‌తో కుమారుడి మృతి.. ఆటో బోల్తాపడి తండ్రికి గాయాలు
అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం జె.వెంకటాంపల్లి గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అభిలాష్ (19) అనే యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం అభిలాష్ మృతదేహాన్ని తండ్రి శివయ్య ఆటోలో రాయదుర్గం ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో శివయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 25, 2024
తిప్పేపల్లిలో విదేశీ అతిథులు!
ధర్మవరం నియోజకవర్గంలో సైబీరియా పక్షుల సందడి మొదలైంది. కొన్నిరోజులుగా తిప్పేపల్లి గ్రామంలో తెలుపు, నలుపు, ఎరుపు వర్ణాలతో అందంగా ఉన్న సైబీరియన్ పక్షులు సందడి చేస్తున్నాయి. వరి పొలాల వద్ద కనువిందు చేస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. సైబీరియా, యూరప్ నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి తిప్పేపల్లికి రావడం శుభ సూచకమని గ్రామ ప్రజలు పేర్కొన్నారు. ఈ పక్షులు ఏటా తమ గ్రామానికి వచ్చే విదేశీ అతిథులని చెబుతున్నారు.