News August 14, 2024
అనంతపురం టవర్ క్లాక్.. మన స్వాతంత్య్రానికి గుర్తు
అనంతపురం పేరు వినగానే ‘టవర్ క్లాక్’ గుర్తుకొస్తుంది. నగర నడిబొడ్డున ఉన్న ఈ టవర్ క్లాక్‌కు ఎంతో చరిత్ర ఉంది. ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేయగా సిద్ధించిన స్వాతంత్ర్య ఉద్యమానికి గుర్తుగా అనంతపురంలో 1947 ఆగస్టు 15న నిర్మించారు. అష్ట భుజాలతో 47 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో నిర్మించారు. 15 అడుగుల వెడల్పు 15వ తేదీని, అష్ట భుజాలు 8వ నెలను, 47 అడుగుల ఎత్తు 1947వ సంవత్సరాన్ని సూచించేలా నిర్మించడం విశేషం.
Similar News
News September 15, 2024
అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమం: అనంత కలెక్టర్
అనంతపురం జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ రెండో తేదీన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ దివస్‌ను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ‘స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని’ నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
News September 15, 2024
అనంత: 195 బాల్స్‌కు 113 రన్స్ చేసిన రికీ భుయ్
అనంతపురం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా జరుగుతోంది. కాగా ఇండియా A & D టీమ్‌లు D టీమ్ బ్యాట్స్ మెన్ రికీ భుయ్ సెంచరీ చేశారు. 195 బాల్స్‌కు 113 రన్స్ చేసి ఔటయ్యారు. అభిమానులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఆదివారం కావడంతో క్రికెట్ అభిమానులు ఆర్డీటీ స్టేడియానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.
News September 15, 2024
ఓడీసీ: డాబా యజమాని ఆత్మహత్య
ఓడీసీ మండలం పరిధిలోని జరికుంటపల్లి గ్రామం వద్ద డాబా యజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. బంధువులు వివరాలు మేరకు శనివారం రాత్రి సుమారు 8:30గంటల సమయంలో డాబా యజమాని రమేష్ నిద్ర వస్తోందని భార్య కుమార్తెతో చెప్పి హోటల్ మేడపై ఉన్న గదిలోకి వెళ్లాడు. చాలా సేపు తర్వాత కుటుంబ సభ్యులు వెళ్లి చూడగాఫ్యాన్‌కు ఉరేసుకోవడంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.