News November 12, 2024

అనంతపురం-తాడిపత్రి మధ్య ఎయిర్ స్ట్రిప్!

image

రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. కుప్పం, దగదర్తి, మూలపేటల్లో విమానాశ్రయాలు, అనంతపురం-తాడిపత్రి మధ్య ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో కదలిక కోసం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.792.72 కోట్లు కేటాయించింది. దీంతో ఆయా చోట్ల అనుకూలతలపై త్వరలో కేంద్రం అధ్యయనం చేయనుంది.

Similar News

News December 6, 2024

‘పోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా సమిష్టి విధులు నిర్వర్తిద్దాం’

image

అనంతపురం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో శుక్రవారం 62వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ పీ.జగదీశ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనంపై వెళ్లి ప్లటూన్లను పరిశీలించారు. 1940 దశకంలో వలంటీర్ వ్యవస్థగా ఏర్పాటైన హోంగార్డు వ్యవస్థ ప్రస్తుతం పోలీసుశాఖలో కీలకంగా ఉందన్నారు.

News December 6, 2024

పుట్టపర్తి: బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. పరారీలో నిందితుడు

image

పుట్టపర్తి రూరల్ మండలం బత్తలపల్లిలో ఓ బాలిక పట్ల అసభ్యకంగా ప్రవర్తించిన వ్యక్తిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన సూరి అనే వ్యక్తి గురువారం ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.

News December 6, 2024

తాడిపత్రిలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

తాడిపత్రి రైల్వే స్టేషన్ పరిధిలోని కోమలి-జూటూరు మధ్య షేక్ బాషా రైలు కిందపడి గురువారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంతకల్లుకు చెందిన షేక్ బాషా పుదిచ్చేరి నుంచి కాచిగూడకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తాడిపత్రి రైల్వే ఎస్ఐ నాగప్ప చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.