News June 20, 2024
అనంతపురం పాతూరు మార్కెట్‌లో కూరగాయల ధరలు…
అనంతపురం పాతూరు మార్కెట్లోని కూరగాయల ధరలు కిలో రూ.లలో టమాటా (మేలు రకం)రూ.80, రెండో రకం రూ.50, మిరపకాయలు రూ.80, ఉల్లిపాయలు (మేలురకం)రూ.40, రెండోరకం రూ.30, బంగాళాదుంప రూ.40, బీన్స్ రూ.60, క్యారెట్ (మేలు రకం) రూ.40, వంకాయలు రూ.20, బెండకాయలు రూ.30, ముల్లంగి రూ.30, బీట్ రూట్ రూ.40, బీరకాయలు రూ.40, కాకరకాయలు రూ.40, క్యాబేజీ రూ.40, మునగ కాయలు రూ.60, నిమ్మకాయలు (వంద)రూ.400 పలుకుతుంది.
Similar News
News September 15, 2024
అనంతపురం జిల్లాకు 8 మంది DSPల రాక
ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎనిమిది మంది DSPలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం రూరల్‌కు DSPగా వెంకటేశ్వర్లు, అనంతపురం-శ్రీనివాసరావు, గుంతకల్-అముదల శ్రీనివాస్, తాడిపత్రి-రామకృష్ణుడు, అనంతపురం ఉమెన్ పీఎస్-మహబూబ్ బాషా, అనంతపురం-శరత్ రాజ్ కుమార్, అనంతపురం-సునీల్, కదిరికి శివనారాయణ స్వామి బదిలీపై రానున్నారు.
News September 15, 2024
అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమం: అనంత కలెక్టర్
అనంతపురం జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ రెండో తేదీన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ దివస్‌ను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ‘స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని’ నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
News September 15, 2024
అనంత: 195 బాల్స్‌కు 113 రన్స్ చేసిన రికీ భుయ్
అనంతపురం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా జరుగుతోంది. కాగా ఇండియా A & D టీమ్‌లు D టీమ్ బ్యాట్స్ మెన్ రికీ భుయ్ సెంచరీ చేశారు. 195 బాల్స్‌కు 113 రన్స్ చేసి ఔటయ్యారు. అభిమానులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఆదివారం కావడంతో క్రికెట్ అభిమానులు ఆర్డీటీ స్టేడియానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.