News April 4, 2025

అనంతపురం: పెళ్లై 6 నెలలే.. అంతలోనే మృతి

image

పెళ్లై 6 నెలలు గడవకముందే వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం సాయంత్రం ఉరవకొండ మండలం రాకెట్ల PABR జలాశయంలో మునిగి కార్తీక్ (25) మృతి చెందాడు. తెలిసిన వారు పిలిస్తే జలాశయం వద్ద వ్యవసాయ మోటర్ దింపడానికి వెళ్ళాడు. జలాశయం లోపలికి వెళ్లిన తరువాత చేపల కోసం వేసిన వల చిక్కుకొని ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 7, 2025

యాడికి: నిద్ర మాత్రలు మింగి యువకుడి సూసైడ్

image

యాడికి మండలం నగురూరుకు చెందిన శరత్ కుమార్(23) నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకున్నాడు. గత నెలలో శరత్ కుమార్ బళ్లారిలో వివాహం చేసుకున్నాడు. బెంగళూరులో ప్రైవేట్ జాబ్‌లో జాయిన్ అయ్యాడు. శుక్రవారం నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో తన స్నేహితుని ఇంటికి వెళ్లాడు. అక్కడ నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అనంతపురం తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

News December 7, 2025

ఫ్లోర్ బాల్ అనంతపురం జిల్లా జట్టు ఇదే..!

image

రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలకు అనంతపురం జిల్లా జట్టు సిద్ధమైంది. ఇవాళ నరసరావుపేటలో జరగనున్న 19వ సీనియర్ ఫ్లోర్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో అనంతపురం జిల్లా జట్టు పాల్గొంటుందని జిల్లా సెక్రటరీ కె.లక్ష్మీనారాయణ తెలిపారు. క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

News December 7, 2025

అంతనపురం మహిళా నేతకు కీలక పదవి

image

బీజేపీ మహిళా మోర్చా అనంతపురం జిల్లా అధ్యక్షురాలిగా అనంతపురానికి చెందిన సౌభాగ్య నియామకమయ్యారు. ఈ మేరకు అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేశ్ ఆమెకు నియామక పత్రం శనివారం అందజేశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సౌభాగ్య చెప్పారు. పదవిని బాధ్యతగా భావిస్తానన్నారు.