News February 26, 2026

అనంతపురం: పోక్సో కేసులో నిందితుడికి 4ఏళ్ల జైలు

image

శింగనమల మండలం చిన్నమట్లగొందికి చెందిన ముత్యాల సంపత్‌కు పోక్సో కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధించింది. 2020లో ఓ మైనర్ బాలిక పట్ల అతడు అసభ్యంగా ప్రవర్తించగా, శింగనమల పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

Similar News

News April 19, 2026

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ 20% నీటిని ఆదా చేయాలి

image

వేసవి దృష్ట్యా వచ్చే 45 రోజులు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ 20 శాతం నీటిని ఆదా చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కోరారు. నగరంలో నీటి సరఫరాపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్లతో పోలిస్తే ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగిందని, సరఫరా 52 వేల నుంచి లక్షా 8 వేలకు చేరిందన్నారు. కేవలం 20 శాతం ప్రాంతాల్లోనే అధిక డిమాండ్ ఉందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

పాకాల: హైవేపై వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

పాకాల నేండ్రగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతదేహం రెండు ముక్కలై గుర్తుపట్టలేని స్థితిలో పడి ఉంది. ఘటనాస్థలిలో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్‌ ప్రకారం తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన ‘సతీష్’గా తెలుస్తోంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.