News July 17, 2024

అనంతపురం: ప్రసవం వరకు గర్భాన్ని దాచిన యువతి

image

డి.హీరేహాళ్ మండలంలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి బెంగళూరుకు వెళ్లింది. అక్కడ అదే ఊరికి చెందిన యువకుడితో ప్రేమ మొదలై గర్భం దాల్చింది. దీంతో ఇంటికి వచ్చి ఈ విషయం ఎవరికీ చెప్పకుండా గర్భం కనపడకుండా దాచుకుంటూ వచ్చింది. నిన్న నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అవాక్కైన తండ్రి ఆ యువకుడితోనే పెళ్లి చేస్తామన్నారు.

Similar News

News December 8, 2025

అనంత: అనాధ పిల్లలకు హెల్త్ కార్డుల పంపిణీ

image

అనాధ పిల్లల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని అనాధ పిల్లలకు హెల్త్ కార్డులను తయారు చేయించింది. అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఈ కార్డులను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఈ సేవను అందిస్తున్న సంగతి తెలిసిందే.

News December 8, 2025

అనంత: ఈనెల 10లోపు టెట్.!

image

అనంతపురంలో ఈనెల 10 నుంచి 21 వరకు TET పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన 7 కేంద్రాల్లో సెషన్ వన్ ఉదయం 9.30 నుంచి 12 వరకు, సెషన్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 షిఫ్టుల్లో జరుగుతాయని వెల్లడించారు.

News December 8, 2025

అనంతపురంలో నేడు ప్రజా వేదిక: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామని కలెక్టర్ ఆనంద్ ఆదివారం తెలిపారు. కాల్ సెంటర్ 1100ను అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, అర్జీల పరిస్థితిని తెలుసుకోవాలన్నా 1100కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.