News November 12, 2024
అనంతపురం: వీళ్లు పట్టు.. ఉడుం పట్టు

అనంతపురం జిల్లా క్రీడాకారులు కుస్తీ పోటీల్లో పట్టు పట్టారంటే మెడల్ రావాల్సిందే అన్నట్లు దూసుకెళ్తున్నారు. కొద్దిరోజులుగా జరుగుతున్న స్కూల్ గేమ్స్ల్లో అండర్ -17 బాలుర విభాగంలో రోహిత్, బాలికల విభాగంలో రాణి గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి ఇవాళ రాష్ట్ర స్థాయిలో పోటీ పడి గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో వారు ఢిల్లీలో డిసెంబర్ 23న జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని కుస్తీ కోచ్ రాఘవేంద్ర తెలిపారు.
Similar News
News November 17, 2025
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నార్పల యువతి

5,895 మీటర్లు ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని నార్పల మండలం దుగుమర్రికి చెందిన యువతి కె. కుసుమ అధిరోహించారు. దీంతో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుసుమను ఆదివారం అభినందించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ పర్వతం, ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో శిఖరంపై కుసుమ (19) ఈ నెల 12న భారత జెండా ఆవిష్కరించడం గర్వకారణమన్నారు.
News November 16, 2025
నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డాక్టర్ కార్తీక్ రెడ్డి

బెలుగుప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్గా పనిచేస్తున్న కార్తీక్ రెడ్డి (39) పంపనూరు పుణ్యక్షేత్రంలో దైవ దర్శనానికి వచ్చి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పంపనూరు క్షేత్రంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దైవ దర్శనానికి వచ్చి సమీపంలోని కాలువలో స్నానానికి దిగగా నీటి ప్రవాహం ఎక్కువై కొట్టుకుపోయినట్లు వివరించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News November 16, 2025
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


