News August 17, 2024
అనంతపురం వెళ్లే బస్సుల రాకపోకలు మళ్లింపు
సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి నుంచి అనంతపురం వెళ్లే బస్సుల రాకపోకలు మళ్లించినట్లు పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ తెలిపారు. భారీ వర్షం కారణంగా కొత్తచెరువు మండలంలోని కేసాపురం సమీపంలో వంక పేరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొత్తచెరువు నుంచి పెనుకొండ మీదుగా ధర్మవరం, అనంతపురానికి బస్సులు తిప్పుతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 17, 2024
తాడిపత్రిలో 10 తులాల బంగారం చోరీ
తాడిపత్రిలోని గాంధీనగర్‌లో సోమవారం చోరీ జరిగింది. నాగరాజు ఇంట్లో లేని సమయంలో దాదాపు 10 తులాల బంగారాన్ని దూసుకెళ్లినట్లు పట్టణ పోలీసులకు భాదితులు నాగరాజు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 17, 2024
అనంతలో విషాదం.. వివాహిత ఆత్మహత్య
అనంతపురంలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఐదో రోడ్లో నివాసం ఉండే అనిత అనే వివాహిత సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News September 16, 2024
ప్లేయర్లకు శుభవార్త.. అనంతపురంలో క్రికెట్ అకాడమీ!
ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీకి వేదికైన అనంతపురంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ (ACA) ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏసీఏ కార్యకర్గ సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కడపలోని అకాడమీని అనంతపురానికి తరలిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై సభ్యులు చర్చించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక్కడ అకాడమీ ఏర్పాటైతే ప్రతిభ ఉన్న క్రికెటర్లకు నాణ్యమైన ట్రైనింగ్ ఫ్రీగా లభిస్తుంది.