News August 14, 2024
అనంతపురం.. 62 మంది సీఐల బదిలీ

అనంతపురం, కర్నూలు జిల్లాల రేంజ్ పరిధిలో 62 మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి, అనంతపురం, గుంతకల్లు రైల్వే, అనంతపురం ఎస్పీ కార్యాలయాల్లో ఉన్న సీఐలను కర్నూలు, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాలకు బదిలీ చేశారు. వారు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. పలువురిని వీఆర్కు పంపారు.
Similar News
News October 18, 2025
2 నియోజకవర్గాలలో అరాచక పాలన: తోపుదుర్తి

రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలలో అరాచక పాలన జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించి మాట్లాడారు. MLA పరిటాల సునీత పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వానికి లేఖ రాసి 50 వేల ఇళ్ల నిర్మాణాలు ఆపారన్నారు. MLA సునీత, పరిటాల శ్రీరామ్ చేనేతల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.
News October 17, 2025

క్రాకర్స్ దుకాణాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ జగదీశ్

క్రాకర్స్ విక్రయలకు అనుమతులు తప్పనిసరని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి షాపులో అగ్నిమాపక పరికరాలు ఉండాలని, షాపుల మధ్య దూరం పాటించాలని తెలిపారు. షెడ్లు ప్రమాదకరంగా ఉండకూడదన్నారు. విద్యుత్ సరఫరా భద్రంగా ఉండేలా సర్టిఫైడ్ ఎలక్ట్రిషన్తో పనిచేయాలని సూచించారు.