News August 6, 2024

అనంతపురం JNTUలో ఆరుగురి విద్యార్థుల సస్పెండ్

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మెకానికల్ ఫైనలియర్ చదువుతున్న ఆరుగురు విద్యార్థులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. శనివారం రాత్రి వీరు మెకానికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో గొడవకు దిగారు. ఒక విద్యార్థిని గాయపరిచారు. ఈ ఘటన చర్చనీయాంశం కావడంతో ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ చర్యలు తీసుకున్నారు.

Similar News

News November 17, 2025

అనంతపురం: పోలీసుల PGRSకు 83 పిటిషన్లు.!

image

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం అర్బన్ DSP శ్రీనివాసరావు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా SP ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 83 పిటీషన్లు వచ్చాయి. పిటిషనర్లతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నార్పల యువతి

image

5,895 మీటర్లు ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని నార్పల మండలం దుగుమర్రికి చెందిన యువతి కె. కుసుమ అధిరోహించారు. దీంతో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుసుమను ఆదివారం అభినందించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ పర్వతం, ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో శిఖరంపై కుసుమ (19) ఈ నెల 12న భారత జెండా ఆవిష్కరించడం గర్వకారణమన్నారు.