News February 24, 2025
అనంతపురానికి సరైన బెర్త్ దక్కేనా?

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉరవకొండ నుంచి 5వసారి గెలుపొంది తొలిసారి క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న పయ్యావుల కేశవ్ ఈ నెల 28న కూటమి ప్రభుత్వ తొలి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మన జిల్లా నేత బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. మరి పయ్యావుల పద్దులో అనంతపురం జిల్లాకు సరైన బెర్త్ దక్కేనా?
Similar News
News March 24, 2025
బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా కొనకొండ్ల రాజేశ్

బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా కొనకొండ్ల రాజేశ్ ఎంపికయ్యారు. ఆదివారం అనంతపురం నగరం షిరిడి నగర్ లేడీస్ హాస్టల్‌లో కురుబ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమంలో కొనకొండ్ల రాజేశ్‌ను ఘనంగా సన్మానించారు. బీజేపీలో ఒక సాధారణ కార్యకర్తగా పనిచేసి, అంచలంచలుగా ఎదిగి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో కురుబ కులస్థులందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
News March 23, 2025
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

గుంతకల్లు ఈద్గా మైదానంలో ఉపవాస దీక్షాపరులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ముందుగా మసీదులో సామూహిక ప్రార్థనలో నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షాపరులకు ఫలహారాలు ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఉపవాస దీక్షపరుల కోసం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందును ఎమ్మెల్యే, ఎంపీ ప్రారంభించారు.
News March 23, 2025
కదిరి: ప్రేమ పేరుతో మోసం.. కేసు నమోదు

కదిరికి చెందిన మనోహర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని, నిజాంవళి కాలనీకి చెందిన షేక్ సోనీ అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.18 లక్షల రుణాలను తన పేరుతో వివిధ బ్యాంకుల్లో పొందాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని తిరిగి చెల్లించకుండా, తనను బెదిరిస్తున్నట్లు తెలిపారు.